తొలి తెలుగు సినీ గీత రచయిత చందాల కేశవదాసు నుండి నేటి వరకు సినిమా పాటకు కావ్య ప్రతిష్ఠ తీసుకురావడానికి కృషి చేసిన అతి కొద్దిమందిలో దాశరథి ఒకరు. ఆయన సాహితీ వైశిష్ట్యంపై ఇప్పటికే అనేకానేక పరిశోధనా పత్రాలు, సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. ఆ జాబితాలో మరో గ్రంథం డా. ఆరవల్లి జగన్నాథస్వామి ‘దాశరథి చలన చిత్ర గీతాలు: విమర్శనాత్మకపరిశీలన’. రచయిత పాత్రికేయులు కావడంతో పాఠకులను చదివింప చేసేలా, తోటి పరిశోధకులను ఆలోచింపచేసేలా గ్రంథంసాగింది. సినీ గీతాల పరిశీలనకే పరిమితం కాకుండా ఆ మహాకవి జీవితాన్ని సైతం కొండను అద్దంలో చూపినచందాన తెలియచేశారు. దాశరథి పాటలు రాసిన సినిమాల పేర్లు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ముఖాముఖీ అదనపు ఆకర్షణ చేకూర్చాయి.

- వడ్డి కార్తికేయ

దాశరథి చలనచిత్ర గీతాలు : విమర్శనాత్మక పరిశీలన

రచన: డా. ఆరవల్లి జగన్నాథస్వామి

పేజీలు: 324,

వెల: 250,

ప్రతులకు: 040-276 78430