ఆత్మీయత - అనురాగం - స్వార్థం - కొత్త విలువలు ఇవన్నీ పోలాప్రగడ రాజ్యలక్ష్మి కథకు నాలుగు స్తంభాలు! ఆమె తాజా కథా సంకలనం ‘మంచి మనసులు’ చదవి తీరాల్సిన బతుకు పాఠం! ‘పేరులో పెన్నిధి’, ‘నిజానిజాలు’, ‘నల్లపూసలు’, ‘కాకిగూటిలో కోకిల’ వంటి కథలు ఈ సంకలనంలో ఆణి ముత్యాలు! ఎలా బతుకుతున్నాం? ఎలా బతకాలి? ఏం నేర్చుకోవాలన్న అంశాలను ఆత్మకు అందేలా అందించారు.

మంచి మనసులు (కథలు),

రచన: పోలాప్రగడ రాజ్యలక్ష్మి,

పేజీలు: 155,

వెల: రూ. 150,

ప్రతులకు : 80963 10140