సినీ పాత్రికేయుడి ప్రయాణం

ఇది సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు తన 46 యేళ్ళ సినీ ప్రయాణంలో ఎదురైన సంఘటనలను గుదిగుచ్చి అందించిన పుష్పగుచ్ఛం. ఓ సాధారణ వ్యక్తి సినిమా జర్నలిస్ట్‌గా ఎలా ఎదిగాడు, ఆ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, మహామహులైన సినీ ప్రముఖులకు ఎలా సన్నిహితుడయ్యాడనే అంశాలు ఇందులో ఉన్నాయి. ఆంధ్రదేశంలోని ఔత్సాహిక కళాకారులంతా సినిమా మీద మోజుతో చెన్నపట్నం వెళుతున్న సమయంలోనే పసుపులేటి రామారావు పాత్రికేయ జీవితాన్ని మొదలుపెట్టడం విశేషం. తెలుగు సినిమా స్వర్ణయుగం తుదిదశలో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రామారావు, సుదీర్ఘ కాలం ఫిల్మ్‌ జర్నలిస్ట్‌గా కొనసాగడమూ విశేషమే. ఈ ప్రయాణంలో తనకెదురైన తీపి, చేదు అనుభవాలతో పాటు... తెలుగు సినిమా తొలి ఐదు దశాబ్దాల పరిణామక్రమాన్ని, తొలితరం సినీ ప్రముఖులకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపర్చారు.

- వడ్డి కార్తికేయ

46 ఏళ్ళ సినీ ప్రస్థానంలో పదనిసలు

రచన: పసుపులేటి రామారావు

పేజీలు : 274, వెల: రూ.300

ప్రతులకు: 93923 64031