కన్నతండ్రిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించిన ఒక దేశభక్తురాలైన యువతి కథ ఈ ‘దిండుకింద నల్లతాచు’ కథ. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దీక్షపూనిన పాకిస్తాన్‌ ఉగ్రవాద నాయకుడు మిజ్రాడిన్‌ ఆచూకీ కనిపెట్టేందుకు తన ప్రాణాలను, శీలాన్నీ కూడా పణంగా పెట్టిన యువతి కల్యాణి సాహసగాథ ఈ నవల. ట్విస్టులు, సస్పెన్సులతో యండమూరి రాసిన లేటెస్ట్‌ రచన. నవ్య వీక్లీలో సీరియల్‌గా ప్రచురితమై పాఠకుల జేజేలు అందుకున్న నవల. దీంతోపాటు యండమూరి రాసిన మరో ఎనిమిది కథలు చదువరికి బోనస్‌గా జతచేసి అందించారు రచయిత. 

 

దిండుకింద నల్లతాచు
యండమూరి వీరేంద్రనాథ్‌
ధర : 120 రూపాయలు, పేజీలు : 192
ప్రతులకు నవసాహితి బుక్‌ హౌ‍స్‌, ఏలూర్‌ రోడ్‌, విజయవాడ–02 ఫోన్‌ 0866–24 32 885