తెలుగు పా‌ఠకులకు సుపరిచితుడైన కథానవలా రచయిత సలీం. నిత్య పఠనశీలి, అవిశ్రాంత అక్షరశీలి. మీదుమిక్కిలి సామాజిక దృక్పథం గల రచయిత. అట్టడుగువర్గాల జీవితాల్ని, అణచివేతకు గురవుతున్న జీవితాల్ని పరిశోధించి ఆయన రాసిన కథలు, నవలలెన్నో. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఆయన మరో నవల ‘దూదిపింజలు’. కుల, మతాల జాడ్యంతో కునారిల్లుతున్న భారతీయ సమాజంలో సామాజిక న్యాయాన్ని ఆశించి ఇస్లాం మతం స్వీకరించిన, విద్యాధికుడైన నూర్‌బాషా(దూదేకులు) యువకుడి జీవితమే ఈ నవల. ఇస్లాం మతాచారాల్ని తూచా తప్పకుండా పాటించే కుటుంబంలో యువతిని నిఖా చేసుకుని అతడెదుర్కొన్న కష్టనష్టాలు, ముస్లిం సమాజంలో చాపకింద నీరులా విస్తరించిన కుల వ్యవస్థ అతడి జీవితాన్ని ఎలా ఆటాడుకున్నదీ హృదయాన్ని కదలించేలా అక్షరబద్ధం చేశారు సలీం. 

దూది పింజలు నవల

సలీం
ధర 150 రూపాయలు
పేజీలు 182
ప్రతులకు జ్యోతి వలబోజు, సెల్‌ 80 963 10140