తెలంగాణ గ్రామీణ జీవద్భాషను తన కథల్లో నిక్షిప్తం చేసిన రచయిత అల్లాడి శ్రీనివాస్‌. శరవేగంగా వచ్చిన సామాజిక మార్పులు, జీవితానుభవాలనుంచి వచ్చిన ఆవేదనలనే కథావస్తువులుగా చేసుకుని రాసిన 16 కథల సంపుటి ఈ ‘ఎడారి పూలు’. విచ్ఛిన్నమైన పల్లెబతుకులు, పల్లె దైన్యం, ఆ పలుకుబడి, నానుడులు, సామెతలు కలగలిసిన స్వచ్ఛమైన తెలంగాణ పాత్రల ప్రతిబింబం ఈ సంపుటి. కులవృత్తులు మాయం, రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పే దైన్య పరిస్థితులు, కూలీల వలసలు,....ఇలా ఈ కథల్లో గ్రామీణ వ్యవసాయ జీవిత కథలు, వారినుంచి పుట్టుకొచ్చిన ఉద్యోగుల కథలివి. సమకాలీన సమాజంపై అవగాహన పెంపొందించే కథలు ఇవన్నీ.

ఎడారిపూలు

అల్లాడి శ్రీనివాస్‌
ధర 100 రూపాయలు
పేజీలు 144
ప్రతులకు రచయిత, భూషణరావుపేట్‌, కథలాపూర్‌ మండలం
జగిత్యాల జిల్లా సెల్‌ 8555 90 90 60
మరియు అన్ని ప్రముఖ పుస్తకా కేంద్రాలలో.