మహాత్మాగాంధీ మరణించినప్పుడు తమ ఇంటిపెద్ద మరణించినట్టు భావించి పల్లెపల్లే రోదించింది. మైలస్నానాలు చేసింది. ‘గాంధీలాంటి వ్యక్తి ఈ భూమ్మీద సంచరించాడంటే భావితరాలకు ఒక విడ్డూరంగా ఉంటుంది’ అన్నారు ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఐన్‌స్టీన్‌. వైవిధ్యంగల భారత్‌ వంటి దేశాలకు గాంధీమార్గమే అనుసరణీయం. గాంధీ గురించి గాడ్సే అభిప్రాయంతోపాటు, ఎందరో మహనీయులు ఈ పుస్తకంలో గాంధీని భిన్నకోణాల్లో ఆవిష్కరించారు. ఇంతగొప్పవ్యక్తి మనదేశంలో పుట్టాడని, అలా బతకడం సాధ్యమేననీ కనీసం తెలుసుకోవడం కోసమైనా మన పిల్లలు ఈ పుస్తకం చదవాలి. 


గాంధేయం

సంపాదకులు : డా.వావిలాల సుబ్బారావు

ధర : 100రూపాయలు, పేజీలు : 144

ప్రతులకు : విశాలాంధ్ర, నవచేతన బుక్‌హౌస్‌ బ్రాంచీలు, 

నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌