ధ్యేయం ... గాంధేయం ..

గాంధీని చంపిన వాడు, ఆయన ఉదార ఆశయాలను కూడా నాశనం చేశాననుకుంటే పొరబాటు! ‘గాంధీజీ ఆశయం ఆయన మరణం తర్వాత సఫలమై విస్తరించాలని పరమేశ్వరుని సంకల్పమేమో’ అనే పటేల్‌ వాక్యాల వంటివి ఇందులో ఎన్నో! గాంధీపై అనువాద, స్వతంత్ర, ప్రసంగ వ్యాసాల ఈ సంపుటిలో మహాత్ముని మాటలూ, లేఖలూ ఉన్నాయి. ‘గాంధీజీ ఉద్యమ సిద్ధాంతాలతో, కార్యవిధానాలతోనూ అందరూ ఏకీభవించకపోవచ్చు. కానీ, వాటిని నిర్లక్ష్యం చేయడానికి మాత్రం వీలులేదన్న ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ విలువైన వాక్యాలు, భూదానోద్యమానికి గాంధీ ఎలా పునాది అయ్యాడో వంటి గణనీయమైన అంశాలు, శ్రీశ్రీ ‘మహాత్మా! ఓ మహర్షీ!’ కవిత, గాంధీని మొదట చూసినప్పటి చార్లీ చాప్లిన్‌ అనుభవాలు, గాంధీ తత్వ పరిశీలన గురించి సర్వేపల్లి రాధాకృష్ణ వంటి పలువురి ప్రముఖుల అభిప్రాయాలు.. మరెన్నెన్నో గుదిగుచ్చి అందించిన పుస్తకమిది.

 

- సన్నిధానం నరసింహశర్మ
గాంధేయం (వ్యాసాలు), సంపాదకుడు : డా. వావిలాల సుబ్బారావు
పేజీలు : 144, వెల : రూ. 100, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు