యవనికపై హనుమచ్ఛాస్త్రి

ఐదు దశాబ్దాల క్రితం ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రామాయణ, భారతాల్లోని కొన్ని ముఖ్య ఘట్టాలను, మృచ్ఛకటికం వంటి కావ్యాల్లోని ‘వసంతసేన’, ‘శకారుడు’ వంటి పాత్రలను తీసుకుని నాటకాలుగా మలిచారు. మాద్రి, విశ్వామిత్రుడు, బలి తదితర పాత్రలను మలిచిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. పురాణ ప్రధాన మైన నాటికలే కాక శ్రీవేద మూర్తులు, కవి సన్మానం, రక్త నైవేద్యం వగైరా పద్యాలతో కూడిన సాంఘిక నాటకాలు కూడా ఉన్నాయి. పదిహేడు నాటికలతోపాటు హనుమచ్ఛాస్త్రి రచించిన ‘మనిషిలో మనిషి’ అనే కథానిక, మూడు పద్య ఖండికలు ఇందులో ఉన్నాయి.

-బాదర్ల

హేమమాలి ఇతర నాటికలు

రచన : ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

పేజీలు: 232, వెల: రూ. 225

ప్రతులకు: 70938 00678