పాత తరానికి పరిచయం అవసరం లేని సుప్రసిద్ధ ఉర్దూ కథా రచయిత కిషన్‌చంద్‌ (1914–1977). అభ్యుదయ రచయితగా ఆయన ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి. అన్ని భారతీయ భాషలు సహా, ఇంగ్లీష్‌, రష్యన్‌, చైనీస్‌, డేనిష్‌, పోలిష్‌, జర్మన్‌, హంగేరియన్‌ వంటి పలు విదేశీభాషల్లోకి ఆయన రచనలు అనువాదమయ్యాయి. ఆయన నవలల అధారంగా ‘మా భూమి’ సహా పలు హిందీచిత్రాలొచ్చాయి. కిషన్‌చంద్‌ పది కథలను నేరుగా ఉర్దూలోంచి తెలుగులోకి అనువదించి ఇలా ఒక సంపుటిగా మనకు అందించారు జ్ఞానేంద్ర. నేనెదురుచూస్తా, బాపూజీ పునరాగమనం, తుపాకీగుండు–చెర్రీపూలు, బియ్యపుదొంగ, ఐదు రూపాయల స్వేచ్ఛ....ఇలా ఇందులోని కథలన్నిటా గొప్ప మానవతావాదం, భావనైశిత్యం, కళాచాతుర్యం గోచరిస్తాయి.

 

 

కిషన్‌చందర్‌ కథలు

అనువాదం : జ్ఞానేంద్ర

ధర : 120రూపాయలు, పేజీలు 148

ప్రతులకు : నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ రోడ్‌, నాగోల్‌, హైదరాబాద్‌–68