పలు భారతీయ భాషల్లో ప్రచురితమైన ‘చందమామ’ పాతతరంలో ఇంటింటా ప్రతిహృదయంతోనూ పెనవేసుకుపోయింది. ఇది కొత్త తరాలకూ వారసత్వంగా పాకింది. రాజుల సాహసకథలు, ఏడేడు సముద్రాలు, రెక్కల గుర్రాలు, మంత్రతంత్రాలు, మర్రిచెట్టు తొర్రలు, బేతాళ కథలు, దేవుళ్ళు, దెయ్యాలు, అపూర్వ శక్తులు...అబ్బో! ఎన్నెన్ని కథలో. ఎన్ని శక్తులున్నా మానవశక్తే గొప్పదని నిరూపిస్తాయి ఇవన్నీ. అప్పట్లో ఎంతోమంది పిల్లలు కూడా ఎంతో స్ఫూర్తితో ఈ కథల్ని ఉత్సాహంగా రాసేవారు. కవి, రచయిత రాఘవరాజు పట్టాభిరామరాజు కూడా అంతే. ఆయన బాల్యంలో ఉండగా, చందమామ సహా బాలమిత్ర, బొమ్మరిల్లు, బాలభారతి, బుజ్జాయి, బాలజ్యోతి పిల్లల పుస్తకాల్లో రాసిన 50కథలను ఇలా ఒక సంపుటిగా వెలువరించారు. మళ్ళీ మళ్ళీ చదువుకునే కథలే ఇవన్నీ.


 
 

చందమామ కథలు

రాఘవరాజు పట్టాభిరామరాజు

ధర : 175రూపాయలు, పేజీలు 202

ప్రతులకు : నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ రోడ్‌, నాగోల్‌, హైదరాబాద్‌–68