ఎంతో ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధీ, సమాజంపట్ల బాధ్యత, ఇతరుల బాగుకోసం తపనగల విశాలదృక్పథమున్న రచయిత మోహన. సీజర్‌ మొదలు విభిన్న యుగాల నాయకులు, వ్యక్తుల చరిత్రలు, వ్యవహారశైలి, విద్యావేత్తల గ్రంథాలు, వ్యాసాలు ఏళ్ళతరబడి చదివి రూపొందించిన పుస్తకం ఈ ‘నిరంతర ప్రేరణ’. రచయిత మాటల్లో చెప్పాలంటే, ‘‘టైటిల్‌కు తగ్గట్టే, ప్రతిఒక్కరికీ ఉపయోగపడేలా రాసిన పుస్తకమిది. హ్యూమన్‌ టెక్నాలజీని ఒంటబట్టించుకోవడానికి దోహదపడే పుస్తకం. పిల్లల పెంపకం సహా, సమాజంలో మనకు ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పే మంచి పుస్తకమిది. ఒక గైడ్‌లా నిత్యం మనం వెంట ఉంచుకోవాల్సిన పుస్తకమిది. 

నిరంతర ప్రేరణ

మోహన
ధర : 399రూపాయలు, పేజీలు : 112, ప్రతులకు : అన్ని పుస్తక దుకాణాలు