జీవిత సారాన్ని పిండిన కథలు

‘పిచ్చుక గూడు’ కథలకు జీవితమే ముడిసరుకు. దాన్ని దాటి పోకుండా ప్రవాహ సదృశమైన ఒరవడితో, విభిన్న జీవన కోణాలను తాకిన కథలు. చురుక్కుమనిపించే వ్యంగ్యం, అవసరం అనుకున్న చోట ఆర్ద్ద్రమై ఒకరకంగా మనలో నిద్రాణమై ఉన్న మానవ చైతన్యాన్ని మేల్కొల్పారు. కథ రాయటం ఒక ఆల్కెమీ. ‘ఎడారిలో వసంతం’, ‘మలిసంజె వేళలో’ వంటి గుర్తుండిపోయే కథలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కాలానికి అనుభవానికి కట్టిన కత్తుల వంతెన ఈ సంపుటం.

- వల్లూరి రాఘవరావు

పిచ్చుక గూడు (కథలు)

రచన: గోగినేని మణి

పేజీలు: 185,

వెల: రూ. 150

ప్రతులకు: విశాలంధ్ర, 94907 53335