పూల మనసులు
నండూరి సుందరీ నాగమణి
ధర 150 రూపాయలు
పేజీలు 168
ప్రతులకు జ్యోతివలబోజు, సెల్‌ 80 963 10 140

వృత్తిరీత్యా ఆంధ్రాబ్యాంక్‌ మేనేజర్‌, ప్రవృత్తిరీత్యా కథానవలా రచయిత్రి నండూరి సుందరీ నాగమణి (సుమన). ఇప్పటివరకు ఆమె రాసిన 160 కథలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 21 కథలున్న ఆమె మూడవ సంకలనం ‘పూలమనసులు’. సాటి మనుషులెవ్వరూ చెడ్డవాళ్ళు కాదు. పరిస్థితులు లేదా తెలియని పొరపాట్లు వాళ్ళని చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తాయి. ఎవరినైనా సున్నితంగా అర్థం చేసుకునే మనసుంటే అందరికీ మనం మేలు చేయగలుగుతాం, ప్రపంచాన్ని ఆనందంగా ఉంచగలుగుతాం అని చెప్పేదే టైటిల్‌ కథ ‘పూలమనసులు’. సౌకుమార్యమైన హృదయస్పందనలకు ప్రతీకలీకథలు.