రంగంటే ఇష్టంసాహితీ చింతనలుచాగంటి తులసిధర : 200రూపాయలు, పేజీలు: 344ప్రతులకు : వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా:వంశీ రామరాజు, సెల్‌ 98490 23 852, జె.వి.పబ్లికేషన్స్‌, సెల్‌ 80 963 10 140, నవోదయ బుక్‌హౌస్‌, బడిచౌడి, హైదరాబాద్‌సాహిత్యవేత్త, అభ్యుదయ రచయిత్రి, అనువాదకురాలు, వక్త చాగంటి తులసి. నాలుగో తరగతిలోనే కథారచయిత్రిగా ఎదిగారామె. చాసో సాహిత్య ట్రస్టు వ్యవస్థాపకురాలు. హిందీ సా‌హిత్యంలో డాక్టరేట్‌పొందిన తులసి, ఒడిసా ప్రభుత్వ విద్యావ్యవస్థలో మూడు దశాబ్దాలు పనిచేసి, ఒడియా–తెలుగు భాషాసంస్కృతుల సేతువుగా పేరొందారు. హిందీ, ఇంగ్లీషు, ఒడియాల నుంచి ఎన్నో అనువాదాలు చేశారు.ఈ పుస్తకంలో ఉన్న 40 వ్యాసాలూ వివిధ పత్రికల్లో వచ్చిన ఆమె పర్సనల్‌ రిఫ్లక్షన్సే.చాసో, నారాయణబాబు, రోణంకి, పురిపండా, ఆరుద్ర, శ్రీశ్రీ, ఉప్పల లక్ష్మణరావు తదితరులతో ఉన్న సాన్నిహిత్యం, వారి అలోచనా విధానాలకు చెందిన ఈ పుస్తకంలోని ప్రస్థావనలన్నీ సాహితీ ప్రియుల హృదయాలను ఆకట్టుకుంటాయి.