నాలుగు దశాబ్దాల కవిత్వ ప్రయాణంలో కోడూరి విజయకుమార్‌ వెలువరించిన ఐదవ కవితా సంపుటి ఈ ‘రేగుపండ్ల చెట్టు’. ఆయన కథ, నాటక రచయిత, వ్యాసకర్త కూడా. ఎన్నో పురస్కారాలందుకున్న విజయకుమార్‌ ప్రధానంగా పదునైన భావోద్వేగాలున్న కవి. వెన్నెల రాత్రుల్లో కుందేళ్ళతో ఎగిరెగిరి ఆడుకున్న ఆటలు, ఎర్రమట్టిరోడ్డు, గిరకలబావిలో నీళ్ళు బొక్కెనతో తోడుకుని ఆరుబయట చేసిన స్నానాలు, మేకపాల రుచిలాగా తీపీ వగరుల రేగుపండ్ల రుచిలాగా ఏనాటి జ్ఞాపకాలో ప్రతి ఎదనూ తడుముతూ ఈనాటి ప్రపంచాన్ని నిలదీస్తుంది విజయకుమార్‌ కవిత్వం.


రేగుపండ్ల చెట్టు
కోడూరి విజయకుమార్‌
ధర : 60 రూపాయలు, పేజీలు : 88
ప్రతులకు : అనల్ప బుక్‌ కంపెనీ, సికింద్రాబాద్‌–014 సెల్‌ 70 938 006 78