పాఠకలోకానికి చిరపరచితమైన పేరు రంగనాథ రామచంద్రరావు. ఎం.ఏ ఇంగ్లీష్‌ చదివిన రామచంద్రరావు ముఖ్యంగా ఎంతో ఇష్టంగా సాహిత్యానువాదం చేస్తున్న దిట్ట. ఈ తాజా అనువాద సంపుటిలో 21 కథలున్నాయి. రష్యన్‌, అమెరికన్‌, జర్మన్‌, హంగేరియన్‌, ఫ్రెంచ్‌ అనువాద కథలతోపాటు, నార్వే, ఆస్ర్టియా, మంగోలియా,కోస్టారికా, ఆల్బేనియా, కొలంబియా, జెకొస్టొవేకియా, నేపాలీ కథలున్నాయి. 

మచ్చుకు చెప్పాలంటే, టైటిల్‌ కథ ‘సిగ్నల్‌’ కథలో్ ఇవానోవ్‌, వ్యాసిలి రైలు ఉద్యోగులు. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా రైలు పట్టాల స్క్రూలు ఊడదీసి పెద్ద ప్రమాదానికి ఒడిగడతాడు వ్యాసిలి. అప్పుడు ఇవానోవ్‌ ఏం చేశాడన్నదే కథ. చివరివాక్యంలో ట్విస్టు మనల్ని అబ్బురపరుస్తుంది. ఇందులోని కథలు మానవ నైజాన్ని ఆవిష్కరిస్తాయి.


సిగ్నల్‌ 
ప్రపంచ భాషల ప్రసిద్ధ కథలు
అనుసృజన రంగనాథ రామచంద్రరావు 
ధర 125 రూపాయలు
పేజీలు 160
ప్రతులకు పల్లవి పబ్లికేషన్స్‌, 59–1–23/2, అశోక్‌ నగర్‌, 
విజయవాడ–10 సెల్‌ 98 66 11 56 55