జరుగుతున్న అన్యాయం మీద కసి ఏర్పడేది. దానికి యథాతథంగా అక్షర రూపం ఇవ్వడం ఆగ్రహ ప్రదర్శనగా ముగిసిపోయి చదివేవారికి వెగటు కలిగిస్తుంది. అందుకే ప్రతీకను, వ్యంగ్యాన్ని ఆశ్రయించాను.

 

ప్రశ్న: నాలుగు దశాబ్దాల కవిత్వ ప్రయాణం తర్వాత ఇటీవల మీరు ‘నివురు’ (2018), ‘నాలుగో పాదం’ (2019) అనే రెండు సంపుటాలను తీసుకొచ్చారు. ఈ ప్రయాణంలో మీరు కవిగా చేసిన ప్రయోగాలు, మిమ్మల్ని మార్పుకి గురి చేసిన సంద ర్భాల గురించి చెప్పండి?

నాలుగున్నర దశాబ్దాలకు ముందు నుంచే కవిత్వం రాస్తున్నాను. మొదట్లో పద్యం, లయాత్మక గేయం రాసేవాడిని. ఆవేశం ఆలం బనగా భావాన్ని నేరుగా వ్యక్తం చేసేవాడిని, భాష మీద ఎంతో కొంత పట్టు వల్ల అవి ప్రత్యేకత కలిగి ఉండేవి. ఆ తర్వాత జీవన పరిశీలన పెరిగి ఆలోచన పదునెక్కుతూ వచ్చింది. అధ్యయనం దానికి తోడయింది. జరుగుతున్న అన్యాయం మీద కసి ఏర్పడేది. దానికి యథాతథంగా అక్షర రూపం ఇవ్వడం ఆగ్రహ ప్రదర్శనగా ముగిసిపోయి చదివేవారికి వెగటు కలిగిస్తుంది. అందుకే ప్రతీకను, వ్యంగ్యాన్ని ఆశ్రయించాను. 1980లో నేను రాసిన ‘కళ్ళు’ దీర్ఘ కవితలో ఇవి బాగా ప్రతిఫలించి, రక్తికట్టించాయని విమర్శకులే అభిప్రాయ పడ్డారు. బీహార్‌ భాగల్‌పూర్‌ ఖైదీల కళ్లల్లో యాసిడ్‌ పోసి గుడ్డి వారిని చేసిన దారుణ ఘటన నేపథ్యంలో దానిని రాశాను.

మనిషి మనిషిగా సకల స్వేచ్ఛలతో, సమానత్వంతో బతకలేకపోతున్న స్థితి నానా టికీ తీవ్రమవుతున్న నేపథ్యం, ఆహార, ఆహార్యాలలో తప్ప ఆలోచనలో, మానవ సంబం ధాలలో, జీవన గమనంలో ఆధునికత, మానవీయత లోపం గాఢతరమవుతున్న స్థితి, కను పించని సంకెళ్ళు మానసికంగా బిగుసుకొని పీడిస్తున్న భయం కర వాస్తవం, సాదారణ మానవుల కాళ్ళ కింది నేల కనుమరుగవుతున్న దృశ్యం కవిత్వ రాయడం వైపు ప్రేరేపించాయి. స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా స్వప్రయో జక శక్తుల విజృంభణ- సమష్టిని కలిసి నడిచే తత్వాన్ని కేన్సర్‌లా కొరుక్కుతింటున్న దుర్గతి కలచివేసింది. దీనిని కవిత్వీకరించవలసిన అవసరాన్ని గుర్తించాను. భావం, భాషల జమిలితనమే కాకుండా వ్యక్తీకరణలో నాదంటూ ఒక ప్రత్యేకత ఉండి అది పాఠకుల్లో ఆలో చనను రేకెత్తించి ఆవేశాన్నో, ఆహ్లాదాన్నో కలిగించేదిగా ఉంటే బాగుం టుందని అనుకున్నాను. అందుకు నాకు చేతనైన రీతిలో ప్రయత్నిం చాను. చిన్న చిన్న పదాల్లో చిక్కనైన భావాన్ని ప్రకటించడం అలవాటు చేసుకున్నాను. అది కవిత నిడివిని తగ్గించింది, దీని వల్ల క్లిష్టత మార్మికత వంటివి వచ్చి చేరినా లోతుగా చూసి ఆలోచించే పాఠకులను ఆకట్టుకునే లక్షణం వాటికి వచ్చింది. ఇదీ ప్రయోగమే అనుకుంటాను.

 

ప్రశ్న: మీ కవిత్వంలో వ్యంగ్యం, తాత్త్వికత, కోపం, ఒకింత వేదన కనబడుతుంటాయి. అవన్నీ క్లుప్తంగా అభివ్యక్తిలో ఇముడు తాయి. దీన్ని ఎలా సాధించారు?

దోపిడీని, దౌర్జన్యాన్ని, అత్యం త సరళంగా, సక్రమంగా సా గిపోతున్నట్టు కనిపించే సెల యేరులాంటి జీవితాలలో కనిపించకుండా లోలోపల ఉండే అసమానత, పీడన లను గమనించినప్పుడు కలిగే విషాద సముద్రపు కెరటాల నురగే వ్యంగ్యం, తాత్వికత, కోపం, వేదనలు- అవన్నీ కలిసి ఆల్చిప్పల్లో రూపొందే ముత్యాల్లాంటి కవితలకు దోహదం చేశాయి.