అందరికీ రోజూలానే తెల్లారింది. కానీ ఆ వీధిలో మాత్రం పనిమనిషి అరుపులు కేకలతో తెల్లారింది. ఒక ఇంట్లో యువతి బెడ్రూమ్‌లోనే హత్యకు గురైంది. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యయ్యో కొత్త కోడలు పాపం! అనుకున్నారంతా. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆయుధంమీద వేలిముద్రలు దొరకలేదు! ఇంతకీ అది వరకట్న వేధింపుల కేసా? లేక మరో కారణంతో జరిగిందా? దర్యాప్తులో ఏం తేలింది?

రాత్రి పదకొండు గంటల సమయంఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.ఒక గది తలుపులు తెరుచుకుని ఓ ఆకారం బయటకు వచ్చింది.పిల్లిలా నడుస్తూ ఓ గది ముందుకెళ్ళింది.చుట్టూ కలయచూసి మెల్లగా గది తలుపులు తోసింది.తలుపు చప్పుడు చేయకుండా తెరుచుకున్నాయి.ఆ ఆకారం గదిలోకి అడుగుపెట్టి లోపలినుంచి గడియపెట్టింది.ఆ ఆకారం రాకకోసమే ఎదురుచూస్తున్నట్టుగా మంచంమీద విలాసంగా పడుకున్నామె మోహనంగా నవ్వింది.ఆ ఆకారం మైమరచిపోతూ మంచం దగ్గరకొచ్చింది. యువతి వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంది.పల్చటి నైటీలోంచి కనీకనిపించని ఆమె అవయవాల పొందికనుచూసి గుటకలు మింగింది ఆ ఆకారం.‘‘ఏంటి ఆలస్యం?’’ చిరుకోపం ప్రదర్శించింది.‘‘అందరూ పడుకోవాలిగా?’’ అంటూ ఆమె ముఖాన్ని తన దగ్గరకు తీసుకుని గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు.

ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి.అతను ఆవేశంతో ఆమె ఒంటిమీది నైటీని తొలగించాడు.పోతపోసిన బంగారు విగ్రహంలా ఉన్న ఆమెను బిగి కౌగిలిలో బంధించాడు.ఆమె ముఖం, మెడ, గొంతు, ఛాతీనంతా ముద్దులతో నింపాడు.ఆమె సుఖంతో మూల్గింది.తమకంతో అతని ఆహ్వానిస్తున్నట్లు రెండు చేతులూ అతని చుట్టూవేసి దగ్గరకు లాక్కుంది.అతను ఒంట్లోని కోరికలు చెలరేగిపోతుండగా ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.మరుక్షణం ఆ గదంతా మూల్గులతో నిండిపోయింది.***సుమారు గంటన్నరపాటు వాళ్ళిద్దరూ రతికేళిలో మునిగితేలారు.ఆమె నిద్రలోకి జారుకుంది.

అతను లేచాడు.అప్పటిదాకా తలుపు కీహోల్‌ నుంచి ఆ దృశ్యం చూసిన మరో ఆకారం చప్పున పక్కకు తప్పుకుంది!అతను గదినుంచి బయటకొచ్చి తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు.అప్పటిదాకా నక్కి కూర్చున్న ఆకారం అదే గదిలోకి ప్రవేశించింది. రతి సుఖంలో మత్తుగా నిద్రపోతున్న ఆమెను తీక్షణంగా చూసింది.కత్తిని ఎత్తి బలంగా ఆమె గుండెల్లో దింపింది.కెవ్వున అరవబోయిన ఆమె నోరు తన చేత్తో నొక్కిపట్టింది ఆ ఆకారం.ఆమె గిలగిలా తన్నుకుని తల పక్కకు వాల్చేసింది.