అతడామె బెడ్రూములోకి ప్రవేశించాడు. ఎదురుగా మంచంమీద దృశ్యంచూసి మైమరచిపోయాడు. ఆమె పడుకున్నభంగిమలో మోకాలుపైకే జారిపోయింది చీర! దీపకాంతిలో మెరిసిపోతున్న ఆమె ఒంపుసొంపులు, పొగరైన వక్షస్థలం అతడిని మరింత కవ్వించాయి. అదే సమయంలో ఆమె తలెత్తి చూసింది. గభాల్న ముందుకుదూకి ఆమెను కౌగలించుకున్నాడతడు. కోరికతో రగిలిపోతూ అతడిని తనమీదకు లాక్కుంది ఆమె.

సమయం మధ్యాహ్నం రెండు గంటలు.సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.వీధిలో జనసంచారం తక్కువగా ఉంది.బాయిందర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ ఝరేకర్‌ డ్యూటీలో ఉన్నాడు. తన సీట్లో కూర్చుని ఒక ఫైలును తీక్షణంగా పరిశీలిస్తున్నాడు.సరిగ్గా అప్పుడే ఆయన టేబుల్‌మీద ఎర్రరంగు ల్యాండ్‌ ఫోన్‌ మోగింది.‘‘హలో ఇన్‌స్పెక్టర్‌ ఝరేకర్‌..’’ అన్నాడు.‘‘సార్‌! ఇక్కడ మర్డర్‌ జరిగింది. వెంటనే రావాలి’’ ఓ కంఠం కంగారుగా చెప్పింది.‘‘హలో...ఎక్కడ? మీరెవరు?’’‘‘రెండవవార్దులో మూడోలైను, నాలుగో ఇంట్లో...మాది ఆ పక్కిల్లే. నా పేరు రమాకాంత్‌’’.‘‘రమాకాంత్‌! మీరెంతో బాధ్యతగా ఇచ్చిన సమాచారం మాకెంతో విలువైంది. థాంక్స్‌! ఆ! ఇదిగో చూడండి, మేం వచ్చేవరకు ఆ పరిసరాల్లోకి ఎవర్నీ వెళ్ళనివ్వకండి. శవాన్నీ, అక్కడి వస్తువుల్ని ఎవర్నీ ముట్టుకోనివ్వకండి. అనుమానితుల్ని మేం వచ్చేవరకు మాటల్లోపెట్టండి’’ అంటూ గబగబా బయటికి వచ్చాడు.

ఆ సంభాషణవిని అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ శశిధర్‌సుర్వే ఎలర్టై జీపుసిద్ధంగా ఉంచాడు. నలుగురు కానిస్టే్ల్స్‌తో ఘటనాస్థలికి బయలుదేరాడు. కొద్ది నిముషాల్లోనే పోలీస్‌ జీపు ఆ ఇంటిముందు ఆగింది.హాల్లో నిలబడ్డవ్యక్తి ఝడేకర్‌కి నమస్కరిస్తూ ‘‘సార్‌, మీకు ఫోన్‌ చేసింది నేనే. శవం ఈ గదిలో ఉంది’’ అంటూ పడగ్గదిలోకి దారితీశాడు. అక్కడి దృశ్యం మహాబీభత్సంగా ఉంది. మంచంమీద హతుడితల కొబ్బరికాయలా పగిలి, మెదడు బైటిక పొడుచుకొచ్చింది. రక్తంతో హతుడి ముఖం భయంకరంగా, గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉంది.

హతుడిషర్టు రక్తంతో తడిసి ముద్దయ్యింది, శవంమీద కదుములు కనిపిస్తున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ కళ్ళు అనుమానంతో ముడిపడ్డాయి. ఓ క్షణం తీవ్రంగా ఆలోచించాడు. హత్యకు ఉపయోగించన ఇనుపరాడ్‌ మంచంకింద కనిపించింది. కబురందుకున్న వేలిముద్రల నిపుణులు, పోలీసుఫొటోగ్రాఫర్లు అక్కడకువచ్చి తమ పనులు పూర్తిచేశారు. శవపంచనామా పూర్తయ్యాక పోస్ట్‌మార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాక, ఇన్‌స్పెక్టర్‌ ఝరేకర్‌ హాల్లోకి వచ్చాడు.