ఆ ఏడాది పరీక్షలన్నీ పూర్తయ్యాక చౌబీస్‌పరగణాలో ఉన్న తల్లితండ్రులను చూడటానికి ఒంటరిగా బయలుదేరిందా యువతి‌. తనువచ్చి దిగబెడతానని బాబాయి ఎంతచెప్పినా వినలేదు‌. తనను రైలు ఎక్కిస్తే చాలనీ, ఒక్కదాన్నేవెళ్ళి వాళ్ళని సర్‌ప్రైజ్‌ చేస్తాననీ చెప్పింది. స్టేషన్‌కు వచ్చి ఆమెను రైలు ఎక్కించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడతను. రైలు కదలగానే ఓ మధ్య తరగతి మహిళ.. ఆ యువతితో మాటలు కలిపి ఆరాలన్నీ అడిగింది.. ఆ తర్వాత..

సుమన్‌ గజగజా వణకిపోతోంది.అంతభయంలోనూ తలెత్తి తన ఎదురుగా ఉన్న స్త్రీని చూసింది.ఒళ్ళంతా కనిపించేలా దుస్తులు వేసుకుంది ఓ యాభై ఏళ్ళ స్ర్తీ. కిళ్ళీ నములుతోంది.రెండు చేతులూ నడుం మీద పెట్టుకుని, గుర్రుగా సుమన్‌వైపు చూస్తోంది.‘‘ప్లీజ్‌ నన్ను వదిలేయండి’’ అంది సుమన్‌ దీనంగా కన్నీళ్ళు కారుస్తూ.‘‘వదిలేయడానికా నిన్ను డబ్బులుపెట్టి కొన్నది? మేమేమైనా నీకు పిచ్చివాళ్ళలా కనిపిస్తు న్నామా? మా మాటవింటే నిన్ను మహారాణిలా చూసుకుంటాం. లేదా మేం అనుకున్నది నీచేత ఎలా చేయించుకోవాలో మాకు తెలుసు’’ అందామె అదోలా నవ్వుతూ.ఆ నవ్వు జింకను చూసిన పులిని గుర్తు తెచ్చింది సుమన్‌కు. పదహారేళ్ళ సుమన్‌ తన జీవితంలో ఎన్నడూ అంతగా భయపడలేదు.

ఆమె వెనుకే నిలబడి ఉన్నాడో దృఢకాయుడు. అతడి ముఖంలో క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.అవకాశం దొరికితే గబుక్కున మాంసంముక్క నోట కరుచుకుని పరుగులు తీయడానికి మాంసం అంగడి దగ్గర సిద్ధంగా కూర్చున్న కుక్కలా కనిపిస్తున్నాడు.సుమన్‌లో భయం, వణుకు ఎక్కువైపోయింది.‘‘నన్ను వదిలేయండి. మా ఇంటికి వెళ్ళిపోతాను’’ అంటూ ఏడవసాగింది.‘‘నువ్విలా దారికిరావే’’ అని ఆమె ఆ యువకుడివైపు తిరిగింది. ‘‘ఓరే, దీన్ని కాస్త మాట వినేట్టు చెయ్‌ రా’’ అని ఆ గదిలోంచి వెళ్ళిపోయింది.ఆమె ఆ మాట చెప్పగానే ఆ యువకుడి కళ్ళు మెరిశాయి. ఆమె వెళ్ళగానే అతను తలుపులుమూసి అడుగు ముందుకు వేశాడు. సుమన్‌ను ఆపాదమస్తకం చూశాడు.విరిసీవిరియని పదహారేళ్ళ మొగ్గ సుమన్‌. ఆమె అందాలు చూడగానే అతడి శరీరం ఉద్రేకంతో ఊగిపోయింది. పెదవులు తడుపుకుంటూ ఆమె మీద పడ్డాడు.సుమన్ ప్రార్థనలు, ఏడుపులూ పెడబొబ్బలన్నీ అరణ్యరోదనలైపోయాయి. క్రూరాతి క్రూరంగా ఆమెను లొంగదీసుకున్నాడు ఆ దృఢకాయుడు.