ఆ ప్రాంతంలో చాలాకాలంగా హత్యలు జరుగుతున్నాయి. అన్నీ ఒకే పద్ధతిలో జరుగుతున్నాయి. యువతులు భయంతో గడగడలాడిపోతున్నారు. బయట తిరగాలంటేనే భయంగా ఉంది వారికి. పోలీసులమీద కూడా నమ్మకం తగ్గింది. మొత్తం తొమ్మిది హత్యలు! హంతకుడు ఎంతకాలం తప్పించుకోగలడు? ఎన్ని హత్యలు చేయగలడు? ఇంతకీ హంతకుడు ఎందుకిలా చేశాడు?

రాత్రి పదకొండైంది. చీకటి. నిశ్శబ్దం. ఫ్లాట్స్‌లో అందరూ నిద్రపోతున్నారు.ఆ ఫ్లాట్‌ హాల్లోమాత్రం ట్యూబ్‌లైట్‌ వెలుగుతోంది. అతనికెదురుగా కూర్చుందామె. అందంతో మెరిసిపోతోంది. ఆమె అందాన్నిచూస్తూ పెదవులు కొరుక్కుంటున్నాడతను. దృఢంగా మాన్లీగా కనిపిస్తున్న అతడినే కళ్ళార్పకుండా ఆహ్వానిస్తున్నట్టుగా చూస్తోంది ఆమె. ‘‘కమాన్‌ డియర్‌! ఈ పెగ్గుతో మన ప్రణయ జీవితానికి నాంది పలుకుదాం’’ అని ఆమెవైపు చేయి చాపాడతను. అతడి కళ్ళల్లోకి మత్తుగాచూస్తూ అతడి చేతిలోగ్లాసును అందుకుని అతన్నే తాగేస్తున్నట్టు గటగటా తాగేసి ఒళ్ళు విరుచుకుంది. అతడి కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్టైంది. లేచి ఆమె ముఖాన్ని తన రెండుచేతుల మధ్యపట్టి ఎర్రటి ఆమె పెదవులను గాఢంగా చుంబించాడు.

ఆమె కన్నులు అరమోడ్పులయ్యాయి. కౌగిట్లోకి తీసుకుని మెల్లగా ఆమెను బెడ్‌రూమ్‌లోకి నడిపించి మంచంమీద పడుకోబెట్టాడు. క్షణాల్లో ఆమెను నగ్నంగా మార్చి తనూ నగ్నంగా మారాడు.ఆమె చేతులుచాపి అతడిని ఆహ్వానించింది. కోరికలతో బుసలుకొడుతూ మరుక్షణం ఆమెను ఆక్రమించాడు. పాములా అతడిని పెనవేసుకుని పోయింది ఆమె.అరగంట తరువాత, ఆమెవైపు చూశాడు. ఆమె కళ్ళు మూసుకుని ఉంది. అటూఇటూ కదిపి చూశాడు. ఆమె స్పృహలేదు. డ్రింక్‌లో మత్తుమందు కలిపిన విషయం గుర్తుతెచ్చుకుని నవ్వుకుని లేచాడు.

మరుక్షణం అతడి చేతులు ఆమె మెడ మీద పడ్డాయి. ఫట్‌మన్న శబ్దం వచ్చింది. ఆమె మెడ ఎముక విరిగింది. ఆమె పెద్దపెద్ద వక్షోజాలవైపు కసిగాచూశాయి.‘మరుక్షణం అతడి దంతాలు ఆమె కుడివక్షంలో దిగబడ్డాయి. చివ్వున బయటికి చిందిన రక్తాన్ని నాలుకచాపి పీల్చాడు. ఎడమ స్తనాన్ని చూసి పళ్ళు కొరికాడు. మంచంకింద పడున్న తన ప్యాంట్‌ అందుకుని ఆ జేబులోంచి కత్తి బయటకు లాగాడు. ఒక్కవేటుతో ఆమె ఎడమ స్తనాన్ని కోసేశాడు. దాన్ని తానుతెచ్చిన ప్లాస్టిక్‌బ్యాగ్‌లో వేసి రబ్బర్‌బ్యాండ్‌తో మూతి బిగించాడు. గబగబా బట్టలేసుకుని ఫ్లాట్‌లోంచి బయటకొచ్చాడు. రోడ్డుచివరకెళ్ళి తన మెర్సిడెస్‌కారెక్కి స్టార్ట్‌ చేశాడు. నల్లటి కారు తెల్లటికాంతి చిమ్ముతూ రోడ్డును మింగుతూ ముందుకు దూసుకుపోయింది.