కళ్ళకు కట్టే ‘ఒక దృశ్యం’!

ఐదారేళ్ళుగా తెలుగు సాహిత్యంలో ఓ శుభపరిణామం నెలకొంది. గతంలో కంటే మిన్నగా సినీ ప్రముఖుల జీవిత విశేషాలకు సంబంధించిన పుస్తకాలు; ప్రపంచ, తెలుగు సినిమాల వివరణాత్మక, విశ్లేషణాత్మక వ్యాస సంపుటాలు ప్రచురితమవుతున్నాయి. తగినంత పాఠకాదరణ వాటికి దక్కక పోతే, ఇన్నేళ్ల పాటు ఇది కొనసాగేది కాదు. తెలుగువారి జీవితంలో సినిమా కూడా ఒక భాగంగా మారిపోవడం ఈ ఆదరణకు కారణమని చెప్పక తప్పదు. తాజాగా ‘ఒక దృశ్యం కొన్ని అర్థ తాత్పర్యాలు’ పేరుతో వంశీకృష్ణ ఓ పుస్తకాన్ని వెలువరించారు. సినిమా ప్రతిష్ఠను ఇనుమడింప చేసిన వ్యక్తుల గురించి, వారి చిత్రాల గురించి ఇందులో వ్యాసాలు ఉన్నాయి. సినీ ప్రముఖుల నివాళి వ్యాసాలూ ఇందులో చోటు చేసుకున్నాయి.

- వడ్డి కార్తికేయ

ఒక దృశ్యం: కొన్ని అర్థ తాత్పర్యాలు (సినీ వ్యాస సంపుటి)

రచన: వంశీకృష్ణ, పేజీలు: 224, వెల: రూ. 150

ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌, 040 - 27678430