హిమాయత్‌నగర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): సమాజ వికాసానికి పుస్తకాలు ఎంతో దోహదపడతాయని మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత సంస్థ కార్యాలయంలో బీసీసీఈ సంస్థ ముద్రించిన మండల్‌ నివేదిక (సంక్షిప్తం) పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని బీసీలు మరింత చైతన్యవంతులై  ప్రగతి సాధించేందుకు మహనీయుల పోరాటం, జీవిత చరిత్రలు స్ఫూర్తిదాయకంగా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్‌ అధికారి మురళి, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, ప్రొఫెసర్‌ ఐ.తిరుమలి, పీఎల్‌.విశ్వేశ్వరయ్య, సంస్థ ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్‌,  గ్రేటర్‌ కార్యదర్శి చిరుకలి శంకర్‌, నాయకులు మన్నారం నాగరాజు, నరేందర్‌గౌడ్‌, ఉ.సాంబశివరావు, ఫైళ్ల ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.