నిజానికి స్త్రీ వాద సాహిత్యాన్ని పరిశీలనాత్మకంగా చదవాల్సిందీ సహృదయంగా అర్థం చేసుకోవాల్సిందీ మగాళ్ళే. ఎందుకంటే ఇంట్లోనూ బయటా ఆధిక్యతా ప్రదర్శనలు చేసేది వారే గనుక. స్త్రీ పురుష అసమానతల్లోని సున్నితమైన అంశాల్ని పట్టించుకోవాల్సింది వారే గనుక. స్త్రీ సహనంతో తప్పక మోయాల్సిన బాధల్ని బాధ్యతలుగా రూపుదిద్దినది వారే గనుక. సామాజిక వ్యవస్థలో అనకొండలా విస్తరించిన పితృస్వామ్య రాజకీయ స్వభావాన్ని ఓల్గా అత్యంత నేర్పుగా తన రచనల్లో చొప్పించగలిగారు. తన దృక్పథం ఏమిటో తను నిర్వహించాల్సిన పాత్ర ఏమిటో తెలుసుకుని, రచనల ద్వారా చేయదగిన నిర్మాణాత్మక కృషి చేసి, తనేమిటో నిరూపితం చేసుకున్నారు.

 
ఓల్గాకు తను చెప్పాల్సిన దాంట్లో ఖచ్చితమైన అవగాహన ఉంది. ఆ అవగాహనతో, తన చుట్టూ ఉన్న స్త్రీల జీవితాల్ని ప్రత్యక్షంగా చూసినపుడు కలిగిన ఆగ్రహంలోంచి, ఒకింత నిగ్రహం పాటించి, అసలు కారణాన్ని శోధించి రాస్తారు. అందుకే ఏ కథలోనూ ప్రురుషుల్ని శత్రువులుగా చూడరు. మిత్ర వైరుధ్యం ఎక్కడుందో చెబుతారు. బలహీనతలేమిటో, ఉండాల్సిన రీతి ఏమిటో మాట్లాడుతారు. ఎక్కడా ద్వేషంతో రగిలిపోయే ప్రకంపనలు కనపడవు. కానీ స్త్రీలు అలాగే బతకాలనే కట్టడిని విధించిన పురుష ప్రపంచాన్ని మాత్రం చీల్చి చెండాడుతారు.
 
 
ఆధునిక స్త్రీ చరిత్ర పునర్లిఖిస్తుందంటే ఆహా... ఓహో అని పొంగిపోయేవారూ ఆఁ... అంటూ నిబిడాశ్చ ర్యంతో నోరెళ్ళబెట్టేవారూ ఇపుడెవరూ లేరు. పెద్ద విశేషం ఏముందిలే అనుకుంటారు, అంతే. దీనికి మహిళలు సాధించిన విజయాలే నిదర్శనం. కొత్త సమాజానికి ఆధునిక స్త్రీ పుట్టుక తప్పనిసరి అయ్యింది. అక్కడితో అయిపోలేదు. అదే మహిళ సమాన హక్కులు, సమాన గౌరవం కావాలని నినదించే స్థాయికి ఎదగడమే కాకుండా ధర్మాగ్రహ పోరాటానికి సిద్ధమైంది. అస్తిత్వ వేదనను అందించింది. కాస్తంత దృష్టి పెట్టమని విశాల సాహిత్య వేదికను ఏర్పరచింది. కథలు, నవలలు ద్వారా సమాజ గతినీ ఆలోచనల్నీ సకల కల్మషాల్నీ కడిగి పారేసే మహ త్తరమైన పని మొదలెట్టింది. అందుకు తగిన తాత్విక భూమికను ఏర్పరచుకోవడం ఒక గొప్ప పరిణామం. తెలుగు సాహిత్యంలో బలమైన గొంతుతో అనితర సాధ్యమైన, ప్రతిభావంతమైన పాత్ర నిర్వహిం చిన వారిలో ఓల్గా ప్రథమ స్థానంలో ఉంటారు.
 
స్త్రీ పురుష అసమా నతలను, పురుషాహం కార ధోరణులను ఎండ గట్టడం; గృహ సంబంధ అణచివేతలకు ఎదురు తిరగడం; సంప్రదాయాల ముసుగులో అస్తిత్వాన్ని కోల్పోవడాన్ని నిరసించడం.. వీటన్నింటికీ ఓల్గా తన ఇతివృత్తాల్లో చోటిచ్చారు. అలా సమాజంలో ఆయా అంశాల్ని చర్చకు పెట్టారు. చర్చకు తన సాహిత్యం ద్వారా దోహదం చేశారు.
 
నిజానికి స్త్రీవాద సాహి త్యాన్ని పరిశీలనాత్మకంగా చదవాల్సిందీ సహృదయంగా అర్థం చేసుకోవాల్సిందీ మగాళ్ళే. ఎందుకంటే ఇంట్లోనూ బయటా ఆధిక్యతా ప్రదర్శనలు చేసేది వారే గనుక. స్త్రీ పురుష అసమానతల్లోని సున్నితమైన అంశాల్ని పట్టిం చుకోవాల్సిందీ వారే గనుక. స్త్రీ సహ నంతో తప్పక మోయా ల్సిన బాధల్ని బాధ్యత లుగా రూపుదిద్దినది వారే గనుక. సామాజిక వ్యవ స్థలో అనకొండలా విస్తరిం చిన పితృస్వామ్య రాజకీయ స్వభా వాన్ని ఓల్గా అత్యంత నేర్పుగా తన రచనల్లో చొప్పించగలిగారు. తన దృక్పథం ఏమిటో తను నిర్వహించాల్సిన పాత్ర ఏమిటో తెలుసుకుని, రచనల ద్వారా చేయదగిన నిర్మాణాత్మక కృషి చేసి, తనేమిటో నిరూపితం చేసుకున్నారు.
 
1980కి ముందు స్త్రీలు రాసేవి పాత సంప్రదాయాలు, పురావ్యక్తిత్వ చిత్రణలే ఉండేవి. సకల చాదస్తాలతో తాతగారి బామ్మగారి భావాలకు దాసులుగానే ఉండేవి. తమను తాము ప్రశ్నించుకోకుండా ఉండిపోయేవి. స్వీయ వ్యక్తీకరణ లేదు. కొన్ని అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పు కునే తీరు లేదు. సంసారపక్షంగా ఉంటే చాలనుకున్నాయి. ఆధునిక భావాలతో చైతన్యవంతమైన పాత్రలు లేవు.
 
ఓల్గా రాసినవేవీ ఒట్టి కథలుగా తీసుకోలేం. కథల్లోని పాత్రలకు జీవలక్షణం ఉంది. సమాజంలో తిరుగాడే పాత్రలవి. ఏవో ఆదర్శాల్ని వల్లెవేయడం కోసం పుట్టినవి కావు. అలాగే ఒక కాలానికి సంబంధించినవి కావు. గతంలో జీవించినవారు, నేటికాలంలో జీవిస్తున్నవారు... అందరికీ చెందిన కథలు. వాటిలో ఉండే ఒత్తిడులు మారొచ్చు. బాధల రూపు, సంఘర్షణల తీరు మారొచ్చు. పోరాడి ఓడి పోతూ నిలదొక్కుకుని ఆత్మగౌరవం ప్రకటించడంలో తేడా లుండొచ్చు. అంత దాక స్త్రీల గురించి ఎంతోమంది రాసి ఉండొచ్చు. సారాంశంలో స్త్రీ పక్షాన సానుభూతి ప్రకటించే కథలు వచ్చి ఉండొచ్చు.