మహాభారత కథలో ముఖ్య పాత్రలు కౌరవ పాండవులు, వారికి గురు స్థానీయులైన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వ థ్థామలు, దృతరాష్ర్టుడు అయిఉండగా, ‘‘కర్ణు తల భారతం’’ అనే నానుడి తెలుగు నాట ప్రసిద్ధమై ఉంది. భారత రణాన్ని కౌరవుల పక్షాన భీష్ముడు పది రోజులు, ద్రోణుడు ఐదు రోజులూ నడుపగా కర్ణుడు రెండు రోజులు మాత్రమే నడిపాడు. అయినప్పటికీ, తిక్కన రచిత ఆంధ్ర భారతంలో కర్ణ పర్వానికి ఉన్న ప్రాముఖ్యం మిగతా వాటికి లేదనే అభిప్రాయం కూడా ప్రసిద్ధమైవుంది. పుట్టిన దగ్గర నుంచీ కూడా మహాభారతంలో కర్ణుడిది ఒక వింత జీవితం. స్వతహాగా అపారమైన మానవీయతతో నిండిన జాలిగుండె కలిగిన మనిషి కర్ణుడు. మాట తప్పడం ప్రాణం పోవడంతో సమానమని భావించి, శరీరంపై పుట్టుకతో సహజంగా వచ్చిన అబేధ్యమైన రక్షణ కవచాన్నే వొలిచి ఇచ్చి తనను తాను బలహీనపరుచుకోవడానికి, మృత్యుముఖాన పడవేసుకోవడానికి సైతం వెనుకాడని వ్యక్తి అతడు.

 

విధి కల్పిత పరి స్థితుల ప్రభావం అతడిని జన్మనెత్తిన మొదటి క్షణం నుంచీ వెంటాడింది; మరణం దాకా వెంటాడుతూనే వుంది. పాండవులకు ప్రబల శత్రువుగా, దుర్యోధనునికి అత్యంత సన్నిహితు డైన, నమ్మకముంచిన వ్యక్తిగా పరిణమించ డానికి కారణమయేలాచేసినవీ విధికల్పిత వింత పరిస్థితులే! చివరికి ‘కర్ణుతలభారతం’ అనే నానుడి స్థిరపడే అంతగా మహాభారతంలో కర్ణుడి ప్రాముఖ్యం పెరిగితే, అతడి జీవితంపై విధి కల్పిత పరిస్థితుల ప్రభావం, యుద్ధ రంగంలో దయనీయ పరిస్థితులలో అతని మరణం, సామాన్య ప్రజానీకానికి కర్ణునిపై అంత ఆత్మీయత పెరగాడినికి కారణమయ్యాయి!

 
చూపులకు కర్ణుడు తల్లి పోలిక! ధర్మరాజు తానుగా ఈ సంగతిని చెబుతాడు మహా భారతం శాంతి పర్వంలో. యుద్ధం ముగిసి, యుద్ధంలో మరణించినవారందరికీ తర్పణాలు వదిలి, ఒక నెల రోజులపాటుగంగా తీరంలో ధృతరాష్ట్ర విదురాది ముఖ్యు లందరినీ వస్త్రాలతో నిర్మించబడిన డేరాలలో ఉంచి కాలం గడుపుతూం డగా, ధర్మరాజును పరామర్శించడానికివచ్చిన నారద మహా మునితో సంభాషణలోనిది సందర్భం! తర్పణాలు వదిలే సందర్భంలో కుంతి నోటినుంచే బయటపడిన సత్యం కర్ణుడు పాండవులలో అగ్రజుడు అన్నది! అది తెలుసుకున్న ధర్మరాజు మనసులో ఎంతగానో దుఃఖి స్తాడు. కర్ణుని రూపాన్ని తలుచుకుంటూ అన్న మాటలు క్రింది పద్యం: