హైదరాబాద్‌: తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో 4వ లిటరరీ ఫెస్ట్ సందర్భంగా ‘తెలుగెత్తి జైకొట్టు’ (శతాధిక సాహితీవేత్తల జీవితం - సాహిత్యం) అంతర్జాతీయ సదస్సు డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రారంభ సభ 14వ తేదీ ఉ.11 నుంచి జరుగుతుంది. ఈ సభకు హిందీ కవి మంగలేష్ దబ్రాల్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. నందిని సిధారెడ్డి సదస్సును ప్రారంభిస్తారు. కె. శివారెడ్డి ‘తెలుగెత్తి జైకొట్టు’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. విశిష్ట అతిథులు సి. మృణాళిని, జూలూరి గౌరీశంకర్, ఎండ్లూరి సుధాకర్, తెలకపల్లి రవి, ఖాదర్ మొహియుద్దీన్, యాకూబ్, చంద్రబోస్, సూర్యా ధనుంజయ్, మువ్వా శ్రీనివాసరావు, గోరటి వెంకన్న. 

తర్వాతి సమావేశాల్లో పాల్గొనేవారి వివరాలు:

14వ తేదీన మొదటి సమావేశంలో తంగిరాల చక్రవర్తి, ఆర్. సీతారాం, బైసా దేవదాసు; రెండవ సమావేశంలో ఖాజా మైనొద్దీన్, పిల్లలమర్రి రాములు, పత్తిపాక మోహన్; మూడవ సమావేశంలో మండవ సుబ్బారావు, ఎస్. రఘు; సాయంత్రం కవి సమ్మేళనంలో ప్రసేన్, కంచర్ల శ్రీనివాస్;

15వ తేదీన ఉ.9.30కు మొదలయ్యే ‘నల్లమల’ పుస్తకావిష్కరణలో ఎస్వీ సత్యనారాయణ, కె. శ్రీనివాస్, గుడిపాటి, భూపతి వెంకటేశ్వర్లు; అదే రోజు నాలుగవ సమావేశంలో స్ఫూర్తి, పతంగి వెంకటేశ్వర్లు; ఐదవ సమావేశంలో మాడుగుల రాములు, ఎస్. త్రివేణి; ఆరవ సమావేశంలో వెన్నెల సత్యం, తిరునగరి చక్రధర స్వామి, మౌనశ్రీ మల్లిక్; ఏడవ సమావేశంలో సలీమ, బెల్లి యాదయ్య, సాయంత్రం కవి సమ్మేళనంలో బి. ప్రసాద మూర్తి, కపిల రాంకుమార్, గేరా, బైరి ఇందిర, చరణ్;

16వ తేదీన ఎనిమిదో సమావేశంలో వహీద్ ఖాన్, ఏనుగు నరసింహారెడ్డి; తొమ్మిదో సమావేశంలో కటుకోఝ్వల రమేష్, శిలాలోలిత; పదో సమావేశంలో వురిమళ్ళ సునంద, పులికొండ సుబ్బాచారి; పదకొండో సమావేశంలో జి. నరేష్, వర ప్రసాద్; సాయంత్రం కవి సమ్మేళనంలో జూపాక సుభద్ర, గాజోజు నాగ భూషణం; ఆ రోజు సదస్సు ముగింపు సభలో వల్లభాపురం జనార్దన, జె. చెన్నయ్య, టి. గౌరీ శంకర్, కె. ఆనందాచారి, తిరునగరి శరత్ చంద్ర... తదితరులు పాల్గొంటారు.

తెలంగాణ సాహితి