అబిడ్స్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): జానపద సాహిత్య రంగానికి బిరుదురాజు రామ రాజు చేసిన కృషి ఎనలేనిదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. మంగళవారం సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో జానపద సాహిత్యోద్ధారకుడు డాక్టర్‌ బిరుదురాజు రామరాజు జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో  ఆయన పేరిట ఏర్పాటు చేసిన స్మారక పరిశోధక పురస్కారాన్ని డాక్టర్‌ కసిరెడ్డి వెంకటరెడ్డికి ప్రదానం చేశారు. భాషా నిలయం అధ్యక్షులు నూతి శంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రమణాచారి మాట్లాడుతూ ఓయూలో జానపదాన్ని పాఠ్యాంశంగా, పరిశోధన అంశంగా ప్రవేశ పెట్టడంలో ఆయన పోషించిన పాత్ర నేటి తరానికి స్ఫూర్తి దాయకమన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు మాట్లాడుతూ జానపద పరిశోధనకు అపారమైన కృషిని అందించిన వ్యక్తి రామరాజు అని గుర్తు చేశారు.