చిక్కడపల్లి,ఏప్రిల్‌18(ఆంధ్రజ్యోతి): రాజా వాసిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి రచించిన వర్ణిక పుస్తకావిష్కరణ సభ గురువారం రాత్రి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించిన లయన్స్‌క్లబ్‌ పూర్వ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ డా.ఎ విజయకుమార్‌మాట్లాడుతూ వస్తుతత్వం తెలిసిన కవయిత్రి మల్లీశ్వరి అన్నారు. ప్రేమను లోతుగా నిర్వచించి కవితలు రాయడం ఆమె ప్రత్యేకత అన్నారు. ఈ కావ్యంలో అందమైన లేఖలు 102 ఉన్నాయన్నారు. అధ్యక్షత వహించిన ప్రముఖ కవి, జర్నలిస్ట్‌ బిక్కి కృష్ణ మాట్లాడుతూ అనేక  అద్భుత కవితా పాఠాలు ఈ లేఖా సాహిత్యంలో చోటు చేసుకున్నాయని అభినందించారు.  ఈ సమావేశంలో జస్టిస్‌ చంద్రకుమార్‌, బైస దేవదాసు, పీఎన్‌ మూర్తి, కాంతికృష్ణ, రాంబాబు, విద్యాధరరావు, కలిమిశ్రీ, రామ్మూర్తి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.