సాహిత్య అకాదెమి, సిద్ధార్థ కళాపీఠం సంయుక్తంగా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో ఈనెల 27వ తేదీ ఉదయం 10.30 గం.లకు ‘తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు’ ఒకరోజు సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రారంభసమావేశానికి కె.శివారెడ్డి అధ్యక్షులు, పి.లక్ష్మణరావు గౌరవ అతిథి. కె.శ్రీనివాస్‌ కీలకోపన్యాసం చేస్తారు. సాహిత్య అకాదమీ కార్యదర్శి శ్రీనివాసరావు స్వాగతం పలుకుతారు. అనంతరం జరిగే రెండు సమావేశాల్లో కుర్ర జితేంద్రబాబు, గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, కె.ఎన్‌.మల్లీశ్వరి, కల్లూరి భాస్కరం, కొలకలూరి మధుజ్యోతి, వాసిరెడ్డి నవీన్‌, నండూరి రాజగోపాల్‌ పత్ర సమర్పణ చేస్తారు.

నవీన్‌