‘స్త్రీవాద సాహితీవేత్త అబ్బూరి ఛాయాదేవి’

రవీంద్రభారతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాల క్రితమే స్త్రీల సమస్యలపై స్పందించిన స్త్రీవాద సాహితీవేత్త అబ్బూరి ఛాయాదేవి అని ప్రముఖ రచయిత్రి మృణాళిని అన్నారు. మంగళవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘నా దృష్టిలో...’ శీర్షికన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బూరి ఛాయదేవి జీవితం-సాహిత్యం అంశంపై మృణాళిని ప్రసంగం చేశారు. కార్యాలయాల్లో స్త్రీలపై జరుగుతున్న ప్రవర్తనను అబ్బూరి అక్షరీకరించారని గుర్తుచేశారు. ఆడవారి సమస్యలపై మగవారిలో ఉన్న భావాలను వ్యక్తీకరించారన్నారు. ఛాయాదేవిని స్ఫూర్తిగా తీసుకుని ఈ తరం రచయిత్రులు రచనలు చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.