కరోనా ఓ కరోనా నీ జన్మస్థలం చైనా 
ఎటువైపో ని అంతిమ ప్రయాణం చెప్పవా ఇప్పటికైనా 

ప్రపంచమే మోకరిల్లింది నీ ముందు
కొంచమైనా లేదా కరుణ జనమందు 
నీ దరిచేరకుండా జగమంతటిని ఇంటివద్దేనే ఉంచావు
మా అందరిమద్య మమతానురాగాలు పెంచావు
ఏనాడో ప్రపంచ ప్రత్యక్ష యుద్దాలు జరిగి ముగిసాయి చరిత్రలో
ఈనాడు పరోక్ష సంగ్రమాలు జరుగుతున్నాయి నీ మనుగడలో
నీ పేరు చెపితే వణుకుతున్నది ప్రపంచమంతా
నీ పై పోరాటానికి నడుంబిగించిది జగమంతా
లాక్‌డౌన్లతో బెంబేలెత్తుతోంది ఆర్ధికరంగం
బ్రేక్‌డౌన్లతో కుదేలవుతోంది వాణిజ్యరంగం
ఆనాడు అఫ్రికావాడు తేచ్చిపెట్టాడు సుఖవ్యాధులును(ఎయిడ్స్) ప్రపంచమంతా
ఈనాడు చైనా వాడు పంచాడు కోవిడ్ వ్యాదిని విశ్వమంతా
రోగుడు ప్రాణం విలువ తెలుసుకుని మానవుడే దేవుడు (వ్యద్యోనారాయణ హరి) అంటున్నారు
జీవుడు జీవం నిలుపుకోడానికి దేవుడే మానవుడుగా అవతరించాడా అని వింటున్నాం
సామాజిక దురాన్ని పాటించకుండా మూల్యం చెల్లించింది ఇటలీ
ఎంతవరకు సాగుతుందో ఈ కరోనా మజిలీ
 
కుట్ర కుతంత్రాలతో ప్రపంచ ఆదిపత్యానికికై సాగుతోంది పోరాటం
కొత్త అన్వేషణకై  వైద్యరంగం పడుతున్నది ఆరాటం
దీనాతి దీనంగా కదులుతున్నది వాణిజ్యరంగం
దేదీప్యమానంగా వెలుగుతోంది ఔషధరంగం
ఆర్ధిక సంక్షోభంలో  సతమతమవుతోంది జగతి
హార్దిక సత్కారాలతో (మిస్టర్ మోడీ) విలసిల్లుతోన్నది నా భారతి (భారతదేశం)
ఓ కరోనా నీ దరి చేరకుండా ఉండాలంటే
మనిషి నీవు నీ ఇంటివద్దేనే  ఉండాలి అంతే
 
 
పీఎస్ఆర్ ప్రసాద్