హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పాలమూరు యూనివర్సిటీ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ గూడూరు మనోజ.. ‘అన్నాబావు సాఠే’ జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 14న ఔరంగాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె అవార్డును అందుకోనున్నారు. అన్నాబావు సాఠే ప్రముఖ మరాఠా రచయిత. ప్రొ.మనోజ.. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యురాలు. వాటిలో పలు రచనలు, పుస్తకానువాదాలు చేశారు. అన్నాబావు సాఠే పుస్తకాన్ని మరాఠీ నుంచి తెలుగులోకి అనువదించారు.