అఫ్జల్‌గంజ్‌/హైదరాబాద్‌, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి ఎడిటర్‌, ప్రముఖ సాహితీవేత్త కె.శ్రీనివా్‌సకు 2020 సంవత్సరానికి దేవులపల్లి రామానుజరావు అవార్డు ప్రదానం చేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. ఈ నెల 25న దేవులపల్లి రామానుజరావు 103వ జయంతి నాడు పురస్కారాన్ని అందజేయనున్నట్లు పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారం కింద రూ.25వేల నగదు, జ్ఞాపిక, దుశ్శాలువాతో సత్కరిస్తారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుందని తెలిపారు.