రవీంద్రభారతి/హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత కవి డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి పురస్కారాన్ని ప్రముఖ కవి జూకంటి జగన్నాధంకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి గురువారం ప్రదానం చేశారు. తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, శాంత బయోటెక్‌ అధినేత వరప్రసాద్‌ రెడ్డి, ప్రముఖ కవి దేశపతి శ్రీనివా్‌సతో పాటు పరిషత్‌ చైర్మన్‌ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జుర్రు చెన్నయ్య, కోశాధికారి మంత్రి నర్సింహయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు జేవీ రూపొందించిన సినారె తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన మహనీయుడు సి.నారాయణ రెడ్డి అని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. 

గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సినారె జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, సినారె చిత్రపటానికి నివాళి అర్పించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళిన్యూఢిల్లీ: సినారెకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. తాను అత్యంత అభిమానించే తెలుగు కవుల్లో సినారే తొలి వరుసలో ఉంటారని పేర్కొన్నారు. రాజసం, ఠీవీ, గాంభీర్యం, లాలిత్యం మేళవింపుగా సాగిన వారి రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధి వేశాయన్నారు.