గజేంద్రమోక్షం - రెండవభాగం జూలై 10 వ తేదీన ప్రారంభం

రఘువీర గద్య  జూలై 3 వ తేదీన ప్రారంభం

ఆన్ లైన్ పాఠాలు

సుప్రసిద్ధ సాహిత్యవేత్త మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్ పురస్కార గ్రహీత డా. అద్దంకి శ్రీనివాస్ గారు ఇటీవల సంప్రదాయ పద్ధతిలో కావ్యపాఠాన్ని చెప్పడం ప్రారంభించగానే ఎందరో కవులూ సాహిత్యప్రియులు, పద్యప్రియులు పద్యాభిమానులూ 500 మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకొని సాహిత్యంపైనా, భాషపైనా తమకు గల అభిమానాన్ని ప్రకటించారు. అదే ఉత్సాహంలో ఇప్పుడు కావ్యంపాఠం గజేంద్రమోక్షం రెండవ భాగాన్ని కూడా జూలై 10 వ తేదినుండి ప్రారంభిస్తున్నారు.

అలాగే  వేదాంతదేశికులు రచించిన రఘవీరగద్యను కూడా మరో కావ్యపాఠం కింద అందిస్తున్నారు. ఇందులో ఎందరో ప్రముఖులు కూడా తమ పేర్లను నమోదు చేసుకొని కావ్యపాఠాన్ని విని ఆనందిస్తున్నారు. తెలుగువారికి భాషాభిమానం సాహిత్యాభిమానం ఎక్కువేనని తేనెలూరే తెలుగును అందంగా అందించాలేగానే ఆస్వాదించేవారు ఎందరో ఉన్నారని అందరూ తమ తమ అభిప్రాయాలను వెలువరిస్తున్నారు.