‘నవలాస్రవంతి’ శీర్షికన ఏప్రిల్‌ 2 నుంచి వంద రోజులపాటు వైవిధ్యభరితమైన తెలుగు, ఇంగ్లీషు రచనలను ఫేస్బుక్‌ లైవ్‌ ద్వారా పరిచయం చేసిన బుక్‌ రీడర్స్‌ క్లబ్‌ ‘కరోనా కతలు’ సంకలనం తీసుకువస్తున్నది. బండి నారాయణస్వామి, కల్లూరి భాస్కరం, కె. శ్రీనివాస్‌, వాడ్రేవు చినవీరభద్రుడు సంపాదక త్వంలో అక్టోబర్‌ 2020లో రానున్న ఈ సంకలనం కోసం తెలుగు రాష్ర్టాలుసహా దేశవిదేశాల కథకుల నుంచి ‘కరోనా కతల’కు ఆహ్వానం! కతలు- బతుకు పోరు, వలస కార్మికుల వెతలు, సామాజిక సామూహిక జీవితం క్షీణించడం, నిర్బంధ ఏకాంతం, నిర్మానుష్యత, బుగులు-దిగులు, ప్రేమికుల విరహం, ఆగిన పెళ్లిళ్లు, పెరిగిన ఖర్చులు, కరోనాతో ఫైట్‌ చేసిన వర్గాలు (వైద్య, పారిశుద్ధ్య, పోలీసు) తదితర మానవ పార్శ్వాల్ని స్పృశించే కథలు సాహిత్యంలోకి రావాలి. ఈ సందర్భాన్ని రికార్డ్‌ చేయాలి. 1. కతలు [email protected]కు మెయిల్‌ చేయాలి. చేరాల్సిన చివరి తేదీ సెప్టెంబర్‌ 15, 2020. 2. కతలు కొత్తవి అయివుండాలి. ప్రింట్‌, వెబ్‌, సోషల్‌ మీడియా, బ్లాగ్‌లలో ప్రచురింపబడినవి అయివుండకూడదు. 3. అనువా దాలు అంగీకరించబడవు. కత స్వంతమేనని ధృవపత్రమూ జతచేయాలి. రచయిత తన గురించి క్లుప్తంగా ఆరేడు లైన్లలో రాసి, ఫోటో జతపరచాలి. 4. తెలుగు యూనికోడ్‌లో టైప్‌ చేసి, ఓపెన్‌ ఫైల్‌గా పంపాలి. 5. కతలు టైపింగ్‌లో 10 పేజీలకు మించకూడదు. స్థానిక మాండలికంలో రాయవచ్చుకానీ సాధ్యమై నంత సరళంగా ఉండాలి. 6. ప్రచురణ నిర్ణయం సంపాదక వర్గానిదే. ప్రచురింపబడని కతల గురించి ముందుగానే తెలియజేస్తాం. 7. ఎంపికైన మొదటి మూడు కతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు బహుమతి ఉంటుంది.

బుక్‌ రీడర్స్‌ క్లబ్‌