చిక్కడపల్లి, అక్టోబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): దుగ్గిరాల ఆత్మీయ రంగస్థల పురస్కార ప్రదానం ఆదివారం రాత్రి జరిగింది. త్యాగరాయగానసభలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి పురస్కారాలను రంగస్థల నటులు డీఎ్‌సఎన్‌ మూర్తి, రచయిత ఎన్‌.తారకరామారావు, కిన్నెర అధినేత రఘురామ్‌లకు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల సోమేశ్వరరావు 88వ జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన ‘గద్యకృతి, వ్యాసాలు, ప్రసంగాలు’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, సినీనటులు రావికొండలరావు, డీజీపీ శాస్త్రి, రమణమూర్తి, లక్ష్మీశ్రీనివాస్‌, డీఏఆర్‌ శర్మ, సత్యభాస్కర్‌, సత్యవాణి, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.