నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 15: ప్రముఖ నాట్యాచార్యులు టంగుటూరి భీమన్‌(72) ఆదివారం అర్ధరాత్రి నిజామాబాద్‌లోని ద్వారకానగర్‌లో కన్నుమూశారు. నిజామాబాద్‌ జిల్లా తిర్మన్‌పల్లిలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ తన నాట్యంతో దేశ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించారు. జిల్లాలో ఎందరో శిష్యులను తయారుచేసిన ఘనత ఆయనకు దక్కింది. 1985 ఆగస్టు నుంచి 21 ఏళ్ల పాటు బాల్‌భవన్‌లో విద్యార్థులకు ఆంధ్రనాట్యంలో శిక్షణ ఇచ్చారు. 2006లో పదవీ విరమణ చేసినా విద్యార్థులకు పేరిణి నృత్యంలో శిక్షణ ఇస్తూ కళామతల్లి సేవలో గడిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆవిర్భావ అవార్డు పొందారు. నాట్య మయూరి, నాట్యాచార్య అవార్డులను సైతం అందుకున్నారు. తిర్మన్‌పల్లిలో శిష్యులు, కళాభిమానుల అశ్రునయనాల మధ్య భీమన్‌ అంత్యక్రియలు సోమవారం జరిగాయి