చేతులు కావాలి  కొన్ని చేతలు కావాలి

కలవకుండా  సాయం చేసే చేతులు కావాలి!

కరోనాను  తరిమికొట్టే చేతలు కావాలి!

అంటురోగం  ప్రబలనివ్వని చేతులు కావాలి!

మరణమృదంగం సాగనివ్వని చేతలు కావాలి!

రండి! రండి దూరంగా ఉంటూనే..  కలిసి నడుద్దాం!

చేతులు బదులుగ .. మనసులు కలిపి..  మనమంతా పనిచేద్దాం!

ఇప్పుడు కాదా!  మన బ్రతుకున కొక సార్థకత్వం వచ్చింది

ఇన్నేళ్ళకి కదా! మనకూ సాయం చేసే వీలే చిక్కింది

ఇక్కడ సమస్య- నీదో నాదో కానే కాదు వినరా తమ్ముడా!

పరిసరాపరిశుభ్రత  ఒక్కటె  బ్రహ్మాస్త్రమ్మని  అనవే చెల్లెలా!

వ్యక్తిని దాటి కరోన ఇప్పుడు కన్నేసింది గుంపులమీద

ఇంట్లో ఉంటూ యుద్ధం చేస్తూ గట్టెక్కేదాం పెద్ద ఆపద

 


డా. అద్దంకి శ్రీనివాస్
ఫోన్ : 9848881838