వివిధ’కు రచనలు పంపే కవులు, రచయితలు ఈకింది అంశాలను గమనించాలని కోరుతున్నాం.

‘వివిధ’లో దీర్ఘకవితలను, సుదీర్ఘ వ్యాసాలను ప్రచురించడం సాధారణంగా సాధ్యపడదు. ప్రధాన వ్యాసాన్ని వెయ్యి పదాలకు, రెండవ వ్యాసాన్ని ఆరు వందల పదాలకు మించకుండా రాసిపంపితే ప్రచురణకు అనుకూలం. ఎక్కువ నిడివి అనివార్యమని రచయితలు భావించినపక్షంలో- వ్యాసాలను సంక్షిప్తం చేయడానికి, అవసరమైనచోట్ల తిరగరాయడానికి అభ్యంతరంలేదని పేర్కొనాలి.ప్రత్యేక పరిస్థితులలో తప్ప, ‘వివిధ’లో సీరియల్‌ వ్యాసాలు, పరంపర వ్యాసాలు ఉండవు.‘వివిధ’కు అసంఖ్యాకంగా అందే రచనలను పరిశీలించడానికి కనీసం 2 నెలల కాలం పడుతుంది. ప్రచురణకు 6 నెలలు కాలం, ఒక్కోసారి అంతకంటె ఎక్కువ సమయం పట్టవచ్చు.ఒకే రచయిత రచనలను వెనువెంటనే ప్రచురించకూడదని ‘వివిధ’ భావిస్తుంది.ఇంటర్నెట్‌లో పబ్లిష్‌ అయిన రచనల్ని, ఇతర పత్రికల తోపాటు ఈ పత్రికకూ పంపిన రచనల్ని పరిశీలించం.రచనలను పోస్టు ద్వారా పంపేవారు రచనలతో పాటు, సొంత చిరునామా రాసిన కవరును స్టాంపులతో సహా జతచేయాలి. లేనిపక్షంలో ప్రచురించని రచనలను తిప్పి పంపడం జరగదు.

కవులు, రచయితలు తాము పంపుతున్న రచన ప్రతిని తమ దగ్గర ఉంచుకోవడం మంచిది. వీలైనంతవరకు ఈమెయిల్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. రాతప్రతుల స్కాన్డ్‌ కాపీలు, లేదా తెలుగు యూనికోడ్‌లోగాని, పేజ్‌మేకర్‌ అనుఫాంట్‌లోగాని టైపు చేసిన ఫైళ్ళు ఈమెయిల్‌ చేయటానికి ప్రయత్నించండి. ఈమెయిల్‌ వివిధ లోగో కింద ఇచ్చాము. వాట్సాప్‌లో పంపేవి తీసుకోము.రచనల ప్రచురణ గురించి రచయితలు ఫోన్‌ ద్వారా సంప్రదించడాన్ని ‘ఆంధ్రజ్యోతి’ అంగీకరించదు. పాఠకుల ఆసక్తులు, ప్రాసంగికత, ప్రాతినిధ్యం, ప్రతిష్ఠాత్మకత- వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ‘వివిధ’లో రచనల ఎంపిక ఉంటుంది. ప్రచురణ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’దే తుదినిర్ణయం.

- ఎడిటర్‌