నాలుగు వారాలు - నాలుగు గ్రంథాలుఅక్టోబరు మాసంలో సి. భవానీదేవి పుస్తకాలు నాలుగింటికి ఆవిష్కరణలు జరగనున్నవి. జూమ్‌ వేదికగా అక్టోబరు 3 సా.6గం.లకు సి.భవానీదేవి కథల సంపుటి ‘తప్తశిల’కు షేక్‌ కాశింబీ హిందీ అనువాదం, అక్టోబరు 10 సా.6గం.లకు మృదులగర్గ్‌ హిందీ నవలకు సి.భవానీదేవి తెలుగు అనువాదం ‘కలసిన మనసులు’, అక్టోబరు 17 సా.6గంలకు సి.రాధాకృష్ణన్‌ హిందీ నవలకు సి.భవానీదేవి తెలుగు అనువాదం ‘అగ్ని’, అక్టోబరు 24 సా. 6గం.లకు సి. భవానీదేవి కవితాసంపుటి ‘వేళ్ళని వెదికే చెట్లు’ ఆవిష్కృతమవుతాయి. సోమేపల్లి వెంకట సుబ్బయ్య, పి. మాణిక్యాంబ, వెన్నా వల్లభరావు, వెలువోలు నాగరాజ్యలక్ష్మి, విహారి, కె.శివారెడ్డి తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 7989346334.  

చలపాక ప్రకాష్‌