చిక్కడపల్లి, అక్టోబర్‌ 17(ఆంధ్రజ్యోతి): సప్తస్వర మాలిక సాంస్కృతిక సంస్థ గురువారం త్యాగరాయ గానసభలో నిర్వహించిన మధుర గీతాల సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది. నిర్వాహకుడు, గాయకుడు మురళీధర్‌తోపాటు శాస్త్రి, కళ్ళేపల్లి మోహన్‌, ఆనంద్‌రెడ్డి, వసంతలక్ష్మి తదితరులు గీతాలు ఆలపించారు. సభలో ఎస్వీ రామారావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి పాల్గొని గాయకులను అభినందించారు.