చిక్కడపల్లి, అక్టోబర్‌20(ఆంధ్రజ్యోతి): త్యాగరాయగాన సభలో ఆదివారం రాత్రి జరిగిన శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకొన్నాయి. బంగారు తెలంగాణ ఫోక్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో బెస్ట్‌ ఛాంపియన్‌ వరల్డ్‌ రికార్డ్‌ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ అధినేత విక్కీమాస్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జానపద నృత్యాలు, వాణీరమణ, జాహ్నవిరెడ్డి, టీవీ శిరీష, కె ప్రియదర్శిని, టి పద్మాశ్రవంతి, ప్రశాంత్‌ శిష్యబృందం నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.