యరకల యాదయ్య కవితా సంపుటి ‘శ్రమ పొదుగు’ ఆవిష్కరణ సభ జనవరి 24 ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ రామచంద్రపురంలోని మల్లికార్జున నగర సంక్షేమ భవనంలో (బీరంగూడ కమాన్‌) జరుగుతుంది. నాళేశ్వరం శంకరం అధ్యక్షులు. నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్య అతిథిగా గోరటి వెంకన్న, విశిష్ట అతిథిగా దేశపతి శ్రీనివాస్‌ హాజరవుతారు. గుడిపాటి, వఝుల శివకుమార్‌, కందుకూరి శ్రీరాములు, వంగరి సతీష్‌, గంజి కిశోర్‌ పాల్గొంటారు.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌, సిహెచ్‌ ఉషారాణి