ప్రముఖ కవి, సాహిత్యవేత్త, కవిసంగమం’ సృష్టికర్త యాకూబ్‌ 60 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక సాహిత్య సంచిక వెలువరించదలిచాం. కవియాకూబ్‌ సృజనకృషిపై కవులు, సాహిత్యకారుల విలువైన వ్యాసాలతో ఒక ప్రత్యేక సంచి కను తీసుకురావాలని సంకల్పించాము. యాకూబ్‌ సృజన కృషిపై మీమీ సాహిత్య వ్యాసాలని సెప్టెంబర్‌ నెలాఖరు లోగా డ్చజుౌౌఛజ్చుఠిజీఃజఝ్చజీజూ.ఛిౌఝ ఈమెయిల్‌కి పంపి తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. ప్రత్యేక సాహిత్య సంచిక కమిటీ సభ్యులు: పలమనేరు బాలాజీ, చల్లపల్లి స్వరూపరాణి, నూకతోటి రవికుమార్‌, వంశీకృష్ణ, అన్వర్‌, గుడిపాటి.

నూకతోటి రవికుమార్‌

 

పాతూరి మాణిక్యమ్మ సాహిత్య పురస్కారం 2020

 పాతూరి మాణిక్యమ్మ సాహిత్య పురస్కారం - 2020 కోసం 2019లో ప్రచురితమైన వచన కవితా సంపుటా ల్లోంచి అత్యుత్తమ కవితా సంపుటిగా బొల్లోజు బాబా ‘మూడో కన్నీటి చుక్క’ ఎంపికైంది. ద్వితీయ, తృతీయ స్థానాలలో దేశరాజు ‘దుర్గాపురం రోడ్‌’, అనిల్‌ డ్యానీ ‘స్పెల్లింగ్‌ మిస్టేక్‌’ ఎంపికయ్యాయి. న్యాయ నిర్ణేత పెరుగు రామకృష్ణ. బహుమతి గ్రహీతలకు పురస్కార ప్రదానం త్వరలో జరుగుతుంది.

పాతూరి అన్నపూర్ణ