మండలి ఫౌండేషన్‌ చిన్న ఖండికలతో కూడిన ఖండకావ్య పద్యరచనలకు ఆహ్వానిస్తోంది. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.25వేలు, రూ.20వేలు, రూ.15వేలు, ప్రోత్సాహక బహుమతి రూ.10వేలు. ఇంతకుముందు ప్రచురించినవి పంపరాదు. పది శీర్షికలు వంద పద్యాలకు తగ్గకుండా నూట యాభైకి మించ కుండా రాయాలి. రచనలను జులై 21లోగా మండలి ఫౌండేషన్‌, గాంధీక్షేత్రం, అవనిగడ్డ చిరునామాకు పంపాలి. వివరాలకు: 9848780872. ఆగస్టు 4న మండలి వెంకటకృష్ణారావు జయంతి సభలో బహుమతులు ప్రకటిస్తారు.

మండలి బుద్ధ ప్రసాద్‌