ప్రముఖ కథకులు, నవలా రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి గారికి 80 సంవత్సరాలు నిండిన సందర్భంగా ‘జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక’ అభినందన సంచికను ప్రచురించదలుచుకుంది. ఊరువాడ బతుకు, బయటి గుడిసెలు, మూడుముక్కలాట, కధల గూడు, తారుమారు, యక్షగానం వంటి వారి రచనలమీద, వ్యక్తిత్వంమీద రచయితలు, మిత్రులు తమ స్పందన వ్యాసాలను 31మార్చిలోగా వాట్సాప్‌ నంబర్లు 7981701220, 7981457092 కు పంపవలసిందిగా మనవి.

జి. చెన్నకేశవరెడ్డి, వేణు సంకోజు