భూపతిచంద్ర మెమోరియల్‌ ట్రస్టు ప్రకటన

హైదరాబాద్‌ సిటీ, నవంబరు21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత నవలాకారుడు అంపశయ్య నవీన్‌కు ‘కీర్తి శిఖర’ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు భూపతిచంద్ర మెమోరియల్‌ ట్రస్టు ప్రకటించింది. ఆయనకు అవార్డుతో పాటు రూ.లక్ష నగదు బహుమతిని ఇస్తామని ఆ సంస్థ ట్రస్టీ వేదకుమార్‌ తెలిపారు. డిసెంబరు 11న నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో అవార్డును ప్రదానం చేస్తామని ఆయన చెప్పారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గ్రంథాలయ ఉద్యమ నాయకుడు మణికొండ భూపతిరావు, చంద్రమ్మ దంపతుల పేరుతో వారి కుటుంబ సభ్యులు ఈ ట్రస్టునునెలకొల్పారు.