కొలకలూరి పురస్కారాలు 2021 ప్రదాన సభ అంతార్జాల వేదిక (జూమ్‌ మీటింగ్‌) ద్వారా ఫిబ్రవరి 26 ఉ.10.30ని.ల నుండి 1.30ని.ల వరకు జరుగుతుంది. ప్రారంభ వేదికలో కొలక లూరి ఆశాజ్యోతి, కొలకలూరి మధుజ్యోతి, కొలకలూరి సుమకిరణ్‌, కట్టమంచి జనార్దనం, చిలుమూరు శ్రీనివాసరావు, కొలకలూరి ఇనాక్‌ పాల్గొంటారు. కవిత్వ పురస్కారాన్ని కొప్పోలు మోహనరావు, పరిశోధన పురస్కారాన్ని మలయ శ్రీ, నాటక పురస్కారాన్ని వల్లూరు శివప్రసాద్‌ స్వీకరిస్తారు. సభలలో భాగంగా కొలకలూరి ఇనాక్‌ ఇటీవలి సాహిత్య పరిచయం, కొలక లూరి ఇనాక్‌ అనువాద సాహిత్య ఆవిష్కరణ ఉంటాయి. ఈ సభలలో శిఖామణి, కనప శ్యాం సుందర్‌, డొక్కా మాణిక్య వరప్రసాద రావు తదితరులు పాల్గొంటారు.

కొలకలూరి లక్ష్మీ తులసి మాధవి